telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ

గవర్నర్ ను కలిసిన టీటీడీ చైర్మన్ .. వైవీ సుబ్బారెడ్డి..

notification on yv subbareddy as ttd chairmen

తిరుమల, తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి విజయవాడలో గవర్నర్ నరసింహన్ ను కలిశారు. ఈ సందర్భంగా గవర్నర్ కు తిరుమల శ్రీవేంకటేశ్వరుడి చిత్ర పటాన్ని బహూకరించి, శాలువాతో సత్కరించారు. తిరుమల పవిత్రతను మరింత సుసంపన్నం చేసేందుకు కృషి చేయాలని, భక్తులకు తక్కువ సమయంలోనే స్వామి వారి దర్శనం కలిగేలా చూడాలని వైవీ సుబ్బారెడ్డికి గవర్నర్ సూచించినట్టు సమాచారం.

టీటీడీలో సమూల మార్పులకు శ్రీకారం చుడుతున్నామని గవర్నర్ కు వైవీ సుబ్బారెడ్డి చెప్పినట్టు తెలుస్తోంది. కాలుష్యం తగ్గించేందుకు విద్యుత్ వాహనాలు తీసుకొస్తామని, తిరుమలలో రద్దీని తగ్గించేందుకు కొండకిందే వసతి ఏర్పాటు చేస్తామని వైవీ సుబ్బారెడ్డి చెప్పారని సమాచారం.

Related posts