సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపులో భాగంగా రాష్ట్రంలో జరిగిన మొదటిరౌండ్ ఓట్ల లెక్కింపులో టీఆర్ఎస్ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతుంది. జహీరాబాద్‌లో 750 ఓట్ల ఆధిక్యంలో, ఆదిలాబాద్‌లో గోడ నగేశ్ 1800 ఓట్ల ఆధిక్యంలో, నాగర్‌కర్నూల్‌లో పి. రాములు 1284 ఓట్ల ఆధిక్యం, సికింద్రాబాద్‌లో సాయికిరణ్ యాదవ్, చేవేళ్లలో రంజిత్‌రెడ్డి, ఖమ్మం, మల్కాజ్గిరి, భువనగిరి, మహబూబ్‌నగర్ పార్లమెంట్ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ ముందంజలో కొనసాగుతుంది. హైదరాబాద్ పార్లమెంట్ స్థానంలో మిత్రపక్షమైన ఎంఐఎం ఆధిక్యంలో ఉంది. ఇక, ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం.. బీజేపీ ఎక్కడా తన ఆధిపత్యాన్ని ప్రదర్శించలేదు. కాంగ్రెస్ మాత్రం ఓ చోట ఆధిక్యంలో ఉన్నట్టు తెలుస్తోంది.

