కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పై పార్లమెంట్ ఉభయ సభల్లో ఎంపీలు ప్రివిలేజ్ నోటీసులు ఇచ్చారు. ఈ మేరకు రాజ్యసభలో చైర్మన్ వెంకయ్య నాయుడుకు, లోక్సభలో స్పీకర్ ఓం బిర్లాకు లేఖలను అందజేశారు.
రాజ్యసభలో ఏప్రిల్ 1న ప్రశ్నోత్తరాల సమయంలో పీయూష్ గోయల్ సమాధానం పార్లమెంట్ ను తప్పుదోవ పట్టించేలా ఉందని టీఆర్ఎస్ ఎంపీలు పేర్కొన్నారు.
డబ్ల్యూటివో నియమావళి నేపథ్యంలో పారా బాయిల్డ్ రైస్ విదేశాలకు ఎగుమతులు చేయలేమని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సభను తప్పుదోవ పట్టించారని ఎంపీలు పైర్ అయ్యారు. కానీ కేంద్ర ప్రభుత్వ వెబ్ సైట్ లో మిలియన్ టన్నుల పారా బాయిల్డ్ రైస్ విదేశాలకు ఎగుమతి చేసినట్లు ఉందని ఎంపీలు పేర్కొన్నారు.
మంత్రి సమాధానం సరైన రీతిలో లేని కారణంగానే ఆయనపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చినట్లు పేర్కొన్నారు. సభాను తప్పుదోవ పట్టించిన కేంద్రమంత్రి పీయూష్ గోయల్ పై చర్యలు తీసుకోవాలని టీఆర్ఎస్ డిమాండ్ చేశారు.
మరోవైపు, పార్లమెంట్లో టీఆర్ఎస్ ఎంపీలు ఆందోళనలకు దిగారు. తెలంగాణ ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ నినాదాలు చేశారు. క్వశ్చన్ అవర్లో అడుగడుగునా అడ్డు తగిలారు. బచావో బచావో కిసాన్ కో బచావో అంటూ నినాదాలు చేశారు
దేశంలో ఎక్కడా లేని విధంగా.. తెలంగాణ స్కూళ్లలో అధిక ఫీజులు: లక్ష్మణ్