తెలంగాణలో కరోనా విలయం కొనసాగుతూనే ఉంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో కరోనా కేసులు 2 లక్షల మార్క్ ను దాటాయి. పేద, ధనిక అనే తేడా లేకుండా అందరికి ఈ వైరస్ సోకుతోంది. ఇప్పటికే తెలంగాణాలో చాలా మంది ప్రజాప్రతినిధులకు కరోనా సోకింది. తాజాగా మరో ఇద్దరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.
ఇటీవల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, పలువురు ప్రముఖులతో సమావేశాల్లో పాల్గొన్న వినయ్ భాస్కర్ కు ఇవాళ పరీక్షల్లో పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. అలాగే.. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కు కరోనా సోకింది. ఇటీవల ఓ వేడుకకు హాజరైన సంజయ్ కుమార్..అసెంబ్లీ సమావేశాల సందర్భంగా టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం హైదరాబాద్ లోనే హోమ్ క్వారన్ టైం లో ఉంటున్నారు సంజయ్ కుమార్.

