తెలంగాణ రాజకీయాల్లో దేశ ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై పార్లమెంట్‌లో చేసిన వాఖ్యలు తీవ్ర దూమారం రేపుతోంది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను విడదీయడంలో కాంగ్రెస్ పార్టీ తీరును పీఎం మోదీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజకీయ స్వలాభం కోసం తలుపులు మూసి తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడంతో పాటు ఏపికి అన్యాయం చేశారని అన్నారు.
కాగా మోదీ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ ప్రతిపక్ష, విపక్ష నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఈ క్రమంలో టీఆర్ ఎస్ పార్టీ మంత్రి కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు.
తెలంగాణ ప్రజలకు ప్రధాని క్షమాపణలు చెప్పాలని ట్విట్టర్ వేదికగా డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజలను పదే పదే అవమానించడం తగదని, ప్రధాని వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు.
రాత్రిపూట రసాయనాలను వదిలేస్తున్నారు: రేవంత్ రెడ్డి