telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నితిన్ “భీష్మ”కు ఊహించని రేటింగ్

Bheeshma

ప్రముఖ హీరో నితిన్ టైటిల్ రోల్ పోషించిన ‘భీష్మ’ మూవీ ఫిబ్రవరి 21న విడుదలై ఘన విజయం సాధించింది. కథానాయకుడు నితిన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలచింది ఈ చిత్రం. ప్రసిద్ధ చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రంలో రష్మికా మందన్న నాయిక. వెంకీ కుడుముల దర్శకుడు. ఈ ఇద్దరి కెరియర్లోను ఈ సినిమా చెప్పుకోదగినదిగా నిలిచింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర అద్భుత విజయాన్ని అందుకొని నితిన్ కు సాలిడ్ కం బ్యాక్ హిట్ గా నిలవడమే కాకుండా ఈ ఏడాది లో నిలిచిన ఆఖరి హిట్ చిత్రంగా కూడా నిలిచింది. అయితే క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా బిగ్ స్క్రీన్ పై అలరించిన ఈ చిత్రం తాలూకా టెలివిజన్ ప్రీమియర్ కు మాత్రం ఊహించని టీఆర్పీనే వచ్చింది. గత కొన్ని రోజుల క్రితం జెమినీ టీవిలో ప్రసారమైన ఈ చిత్రానికి కేవలం 6.65 టీఆర్పీ మాత్రమే రావడం గమనార్హం. ఇలాంటి సినిమాకు ఇలాంటి రేటింగ్ రావడం అనేది నితిన్ అభిమానులకు కాస్త డిజప్పాయింటింగ్ అంశమే.

Related posts