telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

రానా, వెంకటేష్ మల్టీస్టారర్

Venky-and-Rana

దగ్గుబాటి ఫ్యామిలీ హీరోలు వెంకటేష్, రానా కలిసి ఓ సినిమా చేయనున్నారు. ఆ చిత్రాన్ని వచ్చే ఏడాది ప్రకటించబోతున్నారు. ఆ విషయాన్ని రానా స్వయంగా వెల్లడించారు. బాబాయ్‌‌తో కలిసి తాను సినిమా చేస్తున్నానని, స్టోరీతో పాటు మిగతా ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయని రానా తెలిపారు. అయితే రానా ‘విరాటపర్వం’ , వెంకటేష్ ‘నారప్ప’ షూటింగుల్లో బిజీగా ఉన్నారు. అవి రెండూ పూర్తయిన తర్వాత ఈ మల్టీస్టారర్‌పై క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ చిత్రం వచ్చే ఏడాది సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు సమాచారం. గతేడాది వెంకటేష్, తన మేనల్లుడు నాగచైతన్యతో కలిసి ‘వెంకీమామ’ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ కోవలోనే ఈ సారి బాబాయ్-అబ్బాయ్ కలిసి వెండితెరపై సందడి చేయనున్నారన్నమాట. అయితే వీరిద్దరు సినిమాలో కనిపింంచడం ఇదే తొలిసారి కాదు. క్రిష్, రానా కాంబినేషన్లో తెరకెక్కించిన ‘కృష్ణం వందే జగద్గురుం’ సినిమాలోని ఓ పాటలో వెంకటేష్‌ కాసేపు సందడి చేశారు. మరోవైపు మల్టీస్టారర్ సినిమాల్లో నటించడం వెంకటేష్‌కు కొత్తేమీ కాదన్న విషయం తెలిసిందే.

Related posts