telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

తప్పతాగిన టాప్ యాంకర్…. హీరోతో కలిసి రాత్రంతా… !?

Shadow

సినిమా ఇండస్ట్రీలో అబ్బాయిలతో పాటు అమ్మాయిలు కూడా తాగడం సాధారణం అయిపోయింది. గతంలో త్రిష లాంటి హీరోయిన్లు ఇలా తాగేసి రోడ్ల మీద రచ్చ చేస్తూ దొరికిపోయారు కూడా. యాంకర్ ప్రదీప్, రైటర్ బివిఎస్ రవి లాంటి వాళ్లు కూడా అప్పుడప్పుడూ డ్రంక్ అన్ డ్రైవ్‌లో దొరికిపోయారు. సినిమా సక్సెస్ అయితే పార్టీలు చేసుకోవడం అనేది ఆనవాయితీ. అయితే ఒక్కోసారి కంట్రోల్ చేసుకోలేనంతగా తాగేస్తుంటారు కూడా. ఇదిలా ఉండగా… ఈ మధ్యే ఓ టాప్ యాంకర్ మాత్రం ఓ పార్టీలో తప్పతాగి ఒళ్లు మరిచిపోయి పడిపోయిందని ఇండస్ట్రీలో తెగ వార్తలు వినిపిస్తున్నాయి. చివరికి కంట్రోల్ తప్పడంతో పర్సనల్ స్టాఫ్‌ను పిలిపించి దర్శక నిర్మాతలు ఆమెను ఇంటికి సేఫ్‌గా పంపించారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్న మాట. తెలుగు ఇండస్ట్రీలో టాప్ యాంకర్‌గానే కాకుండా నటిగానూ మంచి పేరు సంపాదించుకుంది ఈమె. బుల్లితెరపై వచ్చే ఓ టాప్ షోలో గ్లామర్ ఒలకబోస్తూనే యాంకరింగ్‌తోనూ మతులు చెడగొడుతున్న ఆ ముద్దుగుమ్మకు ఈ మధ్య పెద్ద సినిమాల్లో కూడా ఆఫర్లు వస్తున్నాయి. గతేడాది వచ్చిన ఓ సినిమా ఆమె కెరీర్ మొత్తాన్ని మార్చేసింది కూడా. ఇక ఇప్పుడు ఈ సదరు యాంకర్ ఓ చిన్న సినిమాలో నటించింది. ఈ మధ్యే విడుదలైన ఈ చిత్రానికి మంచి టాక్ వచ్చి.. హిట్ దిశగా అడుగులేస్తుంది కూడా. అయితే సినిమా సక్సెస్ ముందుగానే ఊహించిన క్రేజీ నిర్మాత చిత్రయూనిట్‌కు గ్రాండ్ పార్టీ ఇచ్చాడు. అక్కడ అంతా తాగేసి రచ్చ రచ్చ చేసారని తెలుస్తుంది. పార్టీలో ఈ యాంకర్ కూడా ఓ రేంజ్‌లో తప్పతాగి చిందేసిందనే ప్రచారం జోరుగా జరుగుతుంది. చివరికి ఆమెను కంట్రోల్ చేయలేని స్థాయికి వెళ్లిపోయిందని.. హీరోతో కలిసి డాన్సులు వేస్తూ తెల్లారేవరకు కూడా ఆ పార్టీ ఎంజాయ్ చేసిందని తెలుస్తుంది. 30 దాటిన ఆమెకు పెళ్లి కూడా అయిపోయింది.. అయినా కూడా సినిమాలతో పాటు షోస్‌లో కూడా తనదైన ముద్ర వేసింది. ఇలాగే పార్టీలకు కూడా బాగానే వెళ్లే అలవాటు ఆ యాంకర్ సొంతం.

Related posts