తమిళ సూపర్ స్టార్ కమల్ హాసన్ నేడు 65వ వసంతంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. నటుడిగా 60 ఏళ్ల క్రితం ‘కలత్తూర్ కన్నమ్మ’ సినిమాతో నటుడిగా ప్రస్థానాన్ని మొదలుపెట్టారు కమల్ హాసన్. మొదటి సినిమాలోనే బాల నటుడిగా జాతీయ ఉత్తమ నటుడి అవార్డు అందుకున్నాడు. బాలనటుడిగా శివాజీగణేశన్, ఎంజీఆర్, జెమినీ గణేషన్ వంటి తమిళ అగ్రనటులతో కలసి పనిచేశాడు. తెలుగులో ‘అంతులేని కథ’,‘మరో చరిత్ర’ సినిమాలతో గుర్తింపు లభించింది. ‘స్వాతి ముత్యం’, ‘సాగర సంగమం’, ‘ఇంద్రుడు చంద్రుడు’ వంటి సినిమాల్లో మూడు నంది అవార్డులను అందుకున్న ఏకైక పరభాష నటుడిగా కమల్ హాసన్ రికార్డు సాధించాడు. దశావతారం చిత్రంలో పది పాత్రలలో కనిపించి మెప్పించిన కమల్ తనకి సాటి మరెవరు లేరని నిరూపించాడు. ప్రస్తుతం భారతీయుడు 2 చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఆయన ఎన్నో ప్రయోగాత్మక చిత్రాల్లో నటించి ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నారు. ఇక కమల్ బర్త్‌డే సందర్భంగా అభిమానులు, సినీ సెలబ్రిటీలు ఆయనకి సోషల్ మీడియా వేదికగా ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తాజాగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన ట్విట్టర్లో కమల్‌కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. “సినిమాకు మీ సహకారం అసాధారణమైనది. సినిమాల్లో 60 అద్భుతమైన సంవత్సరాలు పూర్తి చేసినందుకు అభినందనలు. ఇది నిజంగా ఉత్తేజపరిచే విషయం. మీరు ఆనందం మరియు ఆరోగ్యంతో ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను” అని మహేష్ తెలిపారు.
Wishing you a very Happy Birthday @ikamalhaasan sir! Your contribution to cinema has been phenomenal…Congratulations on completing 60 glorious years in Films 👏👏 It’s truly truly Inspiring!
May you have an amazing year filled with happiness and good health…🤗— Mahesh Babu (@urstrulyMahesh) November 7, 2019