telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సూర్య బాటలోనే రవితేజ కూడా…?

Raviteja

లాక్ డౌన్ కారణంగా థియేటర్లు ఇంకా ఓపెన్ కాకపోవంతో సినిమాలను ఓటీటీ ప్లాట్ ఫామ్స్‌లో నేరుగా విడుదల చేస్తున్నారు నిర్మాతలు. సూర్య స్వయంగా తన సినిమా అమెజాన్ ప్రైమ్ ద్వారా అక్టోబర్ 30 న విడుదల చేయనున్నట్లు ప్రకటించాడు. అయితే సూర్య ప్రముఖ ఓటీటీ సంస్థతో ఒప్పందం కుదుర్చుకొని వారు నిర్మించే చిత్రాల్లో నటించడానికి అంగీకరించాడని తెలుస్తుంది. ఇదే బాటలో మాస్ రాజా రవితేజ కూడా ప్రముఖ ఓటీటీ సంస్థ నిర్మాణంలో సినిమాలు చేయబోతున్నాడని అంటున్నారు. రవితేజ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ‘క్రాక్’ మూవీ చేస్తున్నాడు. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక కంటెంట్ బాగుంటే ఓటీటీలో సినిమా చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని, తనకు ఎలాంటి అభ్యంతరం లేదని, అయితే రెమ్యునరేషన్ విషయంలో మాత్రం వెనకడుగు వేసేది లేదని మాస్ రాజా తేల్చి చెప్పినట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరి ఇందులో నిజమెంతో తెలియాల్సి ఉంది.

Related posts