ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ లేఖ రాశారు.
తిరుమల శ్రీవారి దర్శనం కోసం తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖల అమలుపై తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని ఆమె కోరారు.
తిరుమల శ్రీవారి దర్శనం కోసం తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల సిఫార్సు లేఖలను అనుమతించాలని ఇటీల మీరు తీసుకున్న నిర్ణయం సంతోషాన్ని కలిగించిందని కొండా సురేఖ పేర్కొన్నారు.
సిఫార్సు లేఖలపై సానుకూల నిర్ణయం తీసుకున్నందుకు ఆమె ధన్యవాదాలు తెలిపారు.
కానీ తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను టీటీడీ అధికారులు పట్టించుకోవడం లేదని, మీ ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారని మంత్రి తెలిపారు.
శ్రీవారిని దర్శించుకోవడానికి తెలంగాణ నుండి వెళ్లే భక్తుల సంఖ్య పెరుగుతోందని ఆమె పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ విషయంలో టీటీడీకి వెంటనే సూచనలు ఇవ్వాలని ఆమె కోరారు. సిఫార్సు లేఖల విషయంలో జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు
కాలుష్యంపై బీజేపీ నేతల రాజకీయాలు: కేజ్రివాల్