telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

దళితుల పిల్లలని స్తంభానికి కట్టేసి…

Attack

ఏపీ పశ్చిమ గోదావరి జిల్లా జీలుగుమిల్లి మండలం పి.అంకంపాలెంలో పిల్లల మధ్య గొడవ ఘర్షణకు దారి తీసింది. దీంతో ముగ్గురు దళితుల్ని స్తంభానికి కట్టి… కొట్టారు బీసీ సామాజానికి వర్గానికి చెందిన వాళ్లు. అయితే… తాము పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు బాధితులు. ప్రస్తుతం బాధితులు జంగారెడ్డిగూడెం ప్రాంతీయ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. అందుతున్న వివరాల ప్రకారం కిషోర్ అనే వ్యక్తీ  పి.అంకంపాలెం గ్రామం లో వ్యాను తోలుతూ ఉంటాడు. ఇదే క్రమంలో తమ పిల్లలు పక్కింటి వాళ్ళ పిల్లలతో కలసి ఆడుకుంటూ ఉంటారని  అయితే మీరు దళితులు మా ఇంటికి రావద్దు అని వాళ్ళు చెప్పడం తో వాళ్ళ ఇంటి  దగ్గర చిన్న గొడవ అయింది. అయితే ఉరిలో పెద్ద మనుషులు సర్ది చెప్పారట. అయితే అదే రోజు సాయంత్రం  యధావిధిగా అతను పనికి వెళ్ళడంతో  వాళ్ళు  కిషోర్ ఇంటికి వచ్చి అతని భార్యని బెదిరించారు. గ్రామస్తులు కొంత మంది కలసి తనను , వ్యాను ఓనర్ ని కలపి స్తంబానికి కట్టేసి కొట్టారు అని  ఆ దెబ్బలకు తట్టుకోలేక గట్టిగా అరవడంతో ఇంట్లో ఉన్న మా అన్నయ వచ్చి ఇదేమని అడగగా మా అన్నయని ని కూడా కలపి కొట్టారని బాదితుడు వాపోయాడు. చూడాలి మరి ఇంకా ఏం జరుగుతుంది అనేది.

Related posts