telugu navyamedia
క్రైమ్ వార్తలు వార్తలు

తాజ్ ఎక్స్‌ప్రెస్‌లో చేలరేగిన మంట‌లు

ఢిల్లీలో కదులుతున్న రైలులో మంటలు చెలరేగడంతో గందరగోళం నెలకొంది. సమాచారం ప్రకారం.. తాజ్ ఎక్స్‌ప్రెస్ రైలు నంబర్ 12280 మూడు బోగీలలో భారీగా మంటలు చెలరేగాయి.

ఈ ప్రమాదంలో ప్రయాణికులెవరూ గాయపడకపోవడం విశేషం. ప్రస్తుతం మంటలను అదుపు చేసేందుకు సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. అగ్నిప్రమాదం ఎలా జరిగిందన్న సమాచారం ఇంకా తెలియరాలేదు.

అగ్ని ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని ఢిల్లీ ఫైర్ సర్వీస్ డైరెక్టర్ అతుల్ గార్గ్ తెలిపారు.

అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసే పనిలో నిమగ్నమై ఉన్నారని వెల్ల‌డించారు. బోగీ నెంబర్ డి-3, డి-4, డి-2లలో మంటలు చెలరేగిన‌ట్లు రైల్వే అధికారులు వెల్ల‌డించారు.

Related posts