దేశ వ్యాప్తంగా మాత్రమే కాకుండా రెండు తెలుగు రాష్ట్రలో కూడా కరోనా కేసులు విపరీతంగా నమోదవుతున్న విషయం తెలిసిందే. మరి ముఖ్యంగా తెలంగాణలో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈరోజు సీఎస్ కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అధికారాలకు కొన్ని సూచనలు చేశారు. రాష్ట్రంలో కరోనా బెడ్ల సంఖ్యను పెంచాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో బెడ్స్ పెంచాలని ఆదేశించారు. కేసులు పెరిగినా తట్టుకునే విధంగా సిద్ధం కావాలని అధికారులకు సూచించారు. టెస్టుల సంఖ్యను పెంచేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని అన్నారు. వ్యాక్సినేషన్ ను మరింత వేగవంతం చేయాలని కోరారు. అందరూ మాస్కులు ధరించేలా చూడాలని, కరోనా కేర్ సెంటర్లను అన్ని జిల్లాల్లో రెట్టింపు చేయాలని సీఎస్ సోమేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. అయితే చూడాలి మరి మిగిత రాష్ట్రాల మాదిరి ఒకదా కూడా వారంతా లాక్ డౌన్ ఏమైనా విధిస్తారా… అనేది.
previous post
next post