గతేడాది గల్వాన్ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో ప్రాణాలు కోల్పోయిన అమర జవాన్లను తెలంగాణ ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని గతంలో ఇచ్చిన మాట మేరకు.. వారికి సాయం అందించారు.

చైనాతో జరిగిన ఘర్షణలో అమరులైన కర్నల్ సంతోశ్ బాబు పాటు అమరులైన 19 మంది అమర జవాన్ల కుటుంబాలను కూడా ఆర్థికంగా ఆదుకుంటామని కేసీఆర్ ప్రకటించారు. ఈ 19 మంది సైనికుల్లో ఇద్దరు ఝార్ఖండ్‌కు చెందినవాళ్లున్నారు.

ఈమేరకు ఝార్ఖండ్‌లో ఉన్న అమర జవాన్ల కుందన్‌కుమార్ ఓఝా సతీమణి నమ్రత కుమారి, మరో వీరుడు గణేశ్ హన్సదా మాతృమూర్తి కప్రా హన్సదాలకు రూ.పది లక్షల చొప్పున చెక్కులను సోరేన్‌తో కలిసి కేసీఆర్ అందజేశారు.

