జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ మధ్య పొత్తుపై భిన్నమైన వాదనలు తెరపైకి వచ్చాయి… గ్రేటర్ ఎన్నికల్లో జనసేనతో పొత్తు లేదని ఇప్పటికే బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ స్పష్టం చేశారు.. మరోవైపు.. అభ్యర్థుల జాబితాను కూడా సిద్ధం చేసుకుంది జనసేన పార్టీ.. అయితే, దీనినిపై రకరకాల ప్రచారం జరుగుతోంది. దీంతో.. మరోసారి పొత్తులపై క్లారిటీ ఇచ్చారు బండి సంజయ్… ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. జనసేనతో పొత్తులేదని స్పష్టం చేశారు… ఈ విషయంపై ఇప్పటి వరకు పవన్ కల్యాణ్ తో మాట్లాడలేదన్న ఆయన.. రెండు పార్టీల మధ్య చిచ్చు పెట్టె కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు.. జనసేన అధినేత పవన్‌తో నాకు మంచి సంబంధాలు ఉన్నాయని గుర్తుచేసుకున్న తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు… గ్రేటర్ నామినేషన్ల ప్రక్రియ పూర్తి కాగానే పవన్ కల్యాణ్‌ను కలుస్తానని తెలిపారు. ఇక, బీజేపీ తరపున గ్రేటర్లో ప్రచారానికి పవన్ కల్యాణ్‌ను ఆహ్వానిస్తానన్నారు బండి సంజయ్… మా అభ్యర్థులను ఇప్పటికే ఫైనల్ చేశాం.. నామినేషన్ వేసుకోవాలని వారికి సమాచారం కూడా ఇచ్చాం.. అందుకే ఈ ఎన్నికల్లో జనసేనతో పొత్తు ఉండదన్నారు… మరోవైపు.. అభ్యర్థుల ప్రకటనకు ఇంచా సమయం ఉందన్నారు బండి సంజయ్.. టికెట్ ఎవరికి వచ్చినా నిబద్ధత గల కార్యకర్తలు అభ్యర్థి గెలుపు కోసం పనిచేయాలన్న ఆయన… ఎవరన్నా ఆందోళనకి దిగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.. పార్టీ నుండి శాశ్వత బహిష్కరణ ఉంటుందని వార్నింగ్ కూడా ఇచ్చారు.
previous post
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై వాస్తవాలను దాచే ప్రయత్నం: భట్టి