telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

14 నెలల పాలనలో ప్రజల స్వేచ్ఛను హరించారు: యనమల

Yanamala tdp

ఏపీ సర్కార్ పై టీడీపీ నేత యనమల రామకృష్ణుడు విమర్శనాస్త్రాలు సంధించారు. 14 నెలల పాలనలో ప్రజల స్వేచ్ఛను హరించారనిఅన్నారు. 600కు పైగా పోస్టులు సొంత సామాజిక వర్గానికే కేటాయించారని చెప్పారు. గ్రామ స్వరాజ్యం తీసుకొస్తున్నామని వైసీపీ నేతలు చెప్పుకుంటున్నారని అన్నారు. గ్రామ వాలంటీర్లుగా సొంత పార్టీ వాళ్లను నియమించడం గ్రామ స్వరాజ్యమా? అని ఆయన ప్రశ్నించారు.

కరోనా నిధులు రూ.8,000 కోట్లు మళ్లించడం గ్రామ స్వరాజ్యమా? అని ఆయన నిలదీశారు. రాష్ట్రంలో 73, 74వ రాజ్యాంగ సవరణలు ఎందుకు అమలు చేయట్లేదు? అని యనమలప్రశ్నించారు. గత ప్రభుత్వ హయాంలో తాము చేసిన దాంట్లో మూడో వంతు కూడా గ్రామీణాభివృద్ధికి వైసీపీ ప్రభుత్వం ఖర్చు చేయలేదని ఆయన చెప్పారు.

Related posts