మాచర్లలో ఇటీవల టీడీపీ నేతలు బోండా ఉమామహేశ్వరరావు, బుద్ధా వెంకన్నలపై వైసీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డ విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విచారణకు రావాలని మరోసారి నోటీసులు జారీ అయ్యాయి.ఈ నెల 21న విచారణకు రావాలని గురజాల డీఎస్పీ ఆదేశించారు. దాడి ఘటనపై ఆధారాలతో రావాలని ఆయన సూచించారు.
ఈ నెల 18న నోటీసులు జారీ చేసినా ఇరువురు టీడీపీ నేతలు విచారణకు హాజరు కాలేదు. దీంతో గురువారం మరోసారి నోటీసులు పంపారు. కాగా, తమపై జరిగిన దాడి ఘటనలో అనామకులపై కేసులు పెట్టారని, దీనిపై విచారణకు రావాలని తమకు నోటీసులు ఇస్తున్నారని బోండా ఉమ ఇటీవలే ఆరోపించారు.


తాను కాంగ్రెస్ పార్టీలో చేరడం తప్పే.. జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు!