telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

తలసానీ ఫైర్‌: బీసీల రిజర్వేషన్లపై రేవంత్ సర్కార్‌కు బీఆర్‌ఎస్ హోదాలో గట్టిగా ప్రశ్న

తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ సర్కార్‌పై బీఆర్ఎస్ మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శల దాడికి దిగారు.

ఇటీవల రాష్ట్రంలో రేవంత్ సర్కార్ చేపట్టిన కులగణన లెక్కల్లో అనేక తప్పులు ఉన్నాయని ఆరోపించారు. హడావుడిగా అసెంబ్లీలో బీసీ బిల్లు ప్రవేశపెట్టి కేంద్రానికి పంపారని అన్నారు.

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల చట్టబద్ధత కోసం కేంద్రంపై రేవంత్ ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావటం లేదని ధ్వజమెత్తారు.

తెలంగాణలో బీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు కాకుంటే భూకంపం సృష్టిస్తామని హెచ్చరించారు.

ఎన్నికల సమయంలో మోసపూరిత హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ బీసీలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు.

బీసీ రిజర్వేషన్ల అమలు చేయమంటే ఇప్పుడు ఆర్డినెన్స్ అంటున్నారని… అలాంటప్పుడు బిల్లు ఎందుకు ప్రవేశ పెట్టారని ప్రశ్నించారు.

రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్ లో చేర్చి పార్లమెంటులో ఆమోదిస్తేనే చట్టబద్ధత వస్తుందని అన్నారు. 42 శాతం రిజర్వేషన్ బిల్లుకు చట్టబద్ధత కల్పించాకే స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లను అడుక్కోవడానికి తాము యాచకులం కాదని.. ఇది మా బీసీల హక్కు అని అన్నారు.

Related posts