బాలీవుడ్ నటి సన్నీలియోన్ కు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో ఆమె చేసిన ఓవర్ యాక్షన్ కు చిత్రబృందం గుండెల్లో రైళ్ళు పరిగెత్తాయి. అసలేం జరిగిందంటే… సన్నీలియోన్ నటిస్తున్న ఓ సినిమా షూటింగ్‌లో గన్ పేల్చే సన్నివేశాన్ని చిత్రీకరించారు దర్శకుడు. ఓ వ్యక్తి సన్నీలియోన్‌ని గన్ తో కాల్చగానే ఆమె కింద పడిపోయారు. షాట్ ఓకే అయిపోయిందని దర్శకుడు అన్నాడు. కాని సన్నీలియోన్ ఇంకా పైకి లేవలేదు. ముందు ఆమె జోక్ చేస్తుందని అందరూ అనుకున్నారు. కానీ అప్పటికీ ఆమె లేవకపోవడంతో అందరిలో భయం మొదలైంది. అంతలోపే సన్నీ లేచి నవ్వడంతో ఆమె సరదాగా ఇలా చేసిందని తెలుసుకున్న చిత్రబృందం ఊపిరి పీల్చుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోలని సన్నీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.
							previous post
						
						
					

