telugu navyamedia
Uncategorized

లవ్ లో శ్రీముఖి… ఎవరితోనంటే ?

Srimukhi

‘బిగ్‌బాస్ -3’ తో మరింత పాపులర్ అయిన శ్రీముఖితో ఫోటోలు దిగడానికి ఇటీవల దూరప్రాంతాల నుండి అభిమానులు ఆమె ఇంటికి వస్తుండడంతో శ్రీముఖి అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలోనూ పాపకి ఫాలోవర్స్ ఎక్కువే. శ్రీముఖి తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో ముచ్చటించింది. ఈ చిట్‌చాట్‌లో వాళ్లు అడిగిన పలు ఆసక్తికర ప్రశ్నలకు సమాధానాలిచ్చింది.శ్రీముఖి లైవ్‌లోకి రాగానే కుర్రాళ్లంతా కొంటె ప్రశ్నలు సంధించడం మొదలు పెట్టారు. ‘మీరు ప్రేమలో ఉన్నారా?’ అని ఓ నెటిజన్ అడిగ్గా.. శ్రీముఖి ‘అవును’ అని సమాధానం ఇచ్చింది. అలాగే ‘ఎవరైనా ముద్దుపెడతానంటే వద్దన్నారా?’ అని మరో వ్యక్తి ప్రశ్నించగా.. ‘అవును.. ముద్దు వద్దని చెప్పాను’ అంటూ రిప్లై ఇచ్చింది. అలాగే ఫ్రెండ్ నుంచి తప్పించుకునేందుకు కొన్నిసార్లు అబద్ధాలు చెప్పానని, పరీక్షల్లో చాలాసార్లు మోసం చేశానని శ్రీముఖి చెప్పుకొచ్చింది.అలాగే అనుమతి లేకుండా పక్కవారి ఫోన్ చూడాల్సి వచ్చిందని, అది చాలా చెడ్డ అలవాటని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పింది. తనంతట తానేలవ్‌లో ఉన్నాను అని చెప్పింది శ్రీముఖి. ఎవర్ని లవ్ చేస్తున్నట్టు? అంటూ నెటిజన్స్ బుర్రలకి పని చెబుతున్నారు.

Related posts