ప్రముఖ టేలీకాం కంపెనీ భారతి ఎయిర్‌టెల్ ఈ రోజు 10వేల కోట్ల ఏజీఆర్ బకాయిలను టెలికాంశాఖకు చెల్లించింది. టెలికాం సంస్థలు బకాయీలు చెల్లించడం లేదంటూ.. ఇటీవల సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. సుప్రీం సీరియస్ కావడంతో.. ఆ బకాయీలు చెల్లించాలంటూ డీవోటీ అత్యవసర ఆదేశాలు జారీ చేసింది.
టెలికాం డిపార్ట్‌మెంట్‌కు ఎయిర్‌టెల్ మొత్తం 35, 500 కోట్లు బకాయి ఉన్నది. స్పెక్ట్రమ్ చార్జీలు, లైసెన్సు ఫీజుల కింద ఆ సంస్థ బకాయి ఉన్నది. భారతి ఎయిర్‌టెల్ లిమిటెడ్ తరపున 9500 కోట్లు, భారతి హెక్సాకామ్ తరపున 500 కోట్లు చెల్లించినట్లు భారతి ఎయిర్‌టెల్ ఇవాళ ఓ ప్రకటనలో తెలిపింది.