telugu navyamedia
సినిమా వార్తలు

శ్రీవిష్ణు “తిప్పరామీసం” విడుదలకు ముహూర్తం ఫిక్స్

Tm

శ్రీ విష్ణు హీరోగా నటిస్తున్న “తిప్పరా మీసం” సినిమా నవంబర్ 8న ఈ సినిమా విడుదల కానున్నట్లు మేకర్స్ తెలిపారు. బ్రోచేవారెవరురా సినిమాతో శ్రీ విష్ణు మంచి విజయం అందుకోవడంతో తిప్పరామీసం సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఈ యాక్షన్ డ్రామాను ఎల్.కృష్ణ విజయ్ తెరకెక్కిస్తున్నారు. సురేష్ బొబ్బిలి ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా.. సిధ్ సినిమాటోగ్రఫీ అందించారు. నిక్కీ తంబోలి హీరోయిన్‌‌గా నటిస్తున్నారు. ‘తిప్పరా మీసం’ సినిమాను రిజ్వాన్ ఎంటర్‌టైన్మెంట్, ఎల్ కృష్ణ విజయ్ ప్రొడక్షన్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. శ్రీ ఓం సినిమా బ్యానర్ ఈ చిత్రాన్ని సమర్పిస్తుంది. ఇటీవలే విడుదలైన టీజర్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి కావడంతో విడుదల తేదీని ప్రకటించారు చిత్ర యూనిట్. అతి త్వరలోనే ట్రైలర్.. ఆడియో విడుదల వేడుక కూడా జరగనున్నాయి. ‘తిప్పరా మీసం’ తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కులను ఏషియన్ సినిమాస్ సునీల్ ఫ్యాన్సీ అమౌంట్ ఇచ్చి సొంతం చేసుకున్నారు.

Related posts