telugu navyamedia
సినిమా వార్తలు

ఛాంపియన్ కావాలన్న ఆశ‌ ఉంటుంది.. కానీ విజేతగా నిలిచేది ఒక్కడే..

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ స్పోర్ట్స్ డ్రామా “గని”. ఇందులో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సాయి మంజ్రేకర్ వరుణ్ ప్రేమికురాలిగా నటిస్తుంది. ఇప్పటికే ఈ మూవీని నుంచి విడుదలైన ఫస్ట్‌లుక్‌, టైటిల్‌ సాంగ్‌ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. అలాగే గని ప్రపంచం ఇదేనంటూ ప్రత్యేకంగా విడుదల చేసిన వీడియోకు కూడా మంచి రెస్పాన్స్‌ వచ్చింది.

తాజాటా ఈ నేపథ్యంలో తాజాగా మూవీ టీజర్‌ను వదిలారు మేకర్స్ . ప్ర‌తీ ఒక్క‌డి క‌ల‌లో క‌ష్టాలు క‌న్నీలు ఉంటాయి. “కోరికలు ఉంటాయి. కోపాలు ఉంటాయి. కనబడితే గొడవలు ఉంటాయి. అలాగే ఇక్కడున్న ప్రతి ఒక్కడికీ ఛాంపియన్ కావాలన్న ఆశ‌ ఉంటుంది. కానీ విజేతగా నిలిచేది ఒక్కడే… ఆ ఒక్కడివి నువ్వే ఎందుకు అవ్వాలి. వై యూ? ఆట ఆడినా ఓడినా రికార్డ్స్ లో ఉంటావు.. కానీ గెలిస్తే మాత్రమే చరిత్రలో ఉంటావు” అంటూ మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ వాయిస్‌ ఓవర్‌తో చెప్పిన డైలాగ్‌ కేక పెట్టించేలా ఉంది.

ఈ సినిమాలో కన్నడ స్టార్ ఉపేంద్ర, సీనియర్ బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి, జగపతి బాబు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఘనీకి నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించగా అల్లు అరవింద్ సమర్పణలో అల్లు బాబీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. డిసెంబర్‌ 24న ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Related posts