ఏపీ రాజకీయాల్లో రుషికొండ అంశం సంచలనంగా మారింది.
ప్రజాధనం వందల కోట్లు దుర్వినియోగం చేసి జగన్మోహన్ రెడ్డి తాను ఉండేందుకు క్యాంప్ ఆఫీసు కట్టించుకున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి.
ఇదే అంశంపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కూడా స్పందించారు. రుషికొండ ప్యాలెస్ కోసం ప్రజల సొమ్ము ఖర్చు పెట్టి ఉంటే అది క్షమించరాని నేరమన్నారు.
రుషికొండ ప్యాలెస్ను ఎందుకోసం నిర్మించారో ప్రజలకు తెలియాలన్నారు.
అలాగే రుషికొండ ప్యాలెస్ నిర్మాణంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి నిజానిజాలు తేల్చాలన్నారు. తప్పని రుజువైతే బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు.
వైసీపీ ప్రభుత్వం దాదాపు 8 లక్షల కోట్ల అప్పు చేసిందని.. విచ్చలవిడిగా ఖర్చు చేసిందని షర్మిల ఆరోపించారు.


ఎగ్జిట్ పోల్స్ తనను షాకింగ్ కు గురిచేశాయి: కేఏ పాల్