గాంధీ విగ్రహం వద్ద సత్యాగ్రహం చేస్తాను అని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. ఐతే తాజాగా మాట్లాడిన ఆయన భూ కబ్జాలు, ఆక్రమణల తొలగింపుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏదేమైనా ఆముదాలవలస పరిధిలో భూ కబ్జాలన్నింటినీ తొలగిస్తామని.. ఆక్రమణలకు గురైన చెరువులను పరిరక్షిస్తామని ప్రకటించారు.. ఇక, ఆక్రమణలకు పాల్పడినవారిలో ఏ పార్టీకి చెందినవారు ఉన్నా సరే సహించేది లేదని స్పష్టం చేశారు స్పీకర్ తమ్మినేని.. ఆక్రమణలను గుర్తించేందుకు కో-ఆర్డినేషన్ కమిటీ వేశామని.. రెండు మూడు రోజుల్లో కమిటీ మీటింగ్ పెడుతున్నట్టు వెల్లడించిన స్పీకర్.. భూకబ్జాలు, ఆక్రమణలు అన్నింటినీ గుర్తించి కొట్టిపడేస్తామని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. ఒకవేళ ఆక్రమణలు తొలగించకపోతే నేనే గాంధీ విగ్రహం వద్ద సత్యాగ్రహం చేస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు స్పీకర్ తమ్మినేని సీతారాం. అయితే చూడాలి మరి ఏం జరగనుంది అనేది.

