అభివృద్ధి అనేది కేవలం భారతీయ జనతా పార్టీ (బీజేపీ) వల్లనే సాధ్యమవుతోందని ప్రజలు తెలుసుకునే విధంగా పార్టీ శ్రేణులు ముందుకు సాగాలని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఉద్బోధించారు. శ్రీకాకుళం జిల్లా పర్యటనలో పాల్గొన్న ఆయనకు పార్టీ నేతలు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు.
కేంద్రం అందిస్తున్న అభివృద్ధి ఫలాలను ప్రతి సామాన్యుడి వరకు చేరేలా కృషి చేయాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని ఆయన ట్విట్టర్ లో పేర్కొన్నారు. కేంద్రం ఇటీవల తీసుకువచ్చిన నూతన విద్యావిధానం గురించి ఆయన ప్రస్తావించారు. నాడు వాజ్ పేయి సర్వ శిక్ష అభియాన్ తో విద్యావిధానంలో పెను మార్పులు సృష్టించారని తెలిపారు. నేడు మోదీ నూతన విద్యావ్యవస్థతో భావితరాలకు బంగారు బాట వేస్తున్నారని అన్నారు.