telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

శిరోముండనం ఘటన వీడియో చూస్తుంటే కడుపు మండుతోంది: సోమిరెడ్డి

somireddy chandramohan

ఏపీలో శిరోముండనం ఘటనలు కలకలం రేపుతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా దళితులపై దాడులపై టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి దుశ్చర్యలు చూస్తుంటే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం బతికుందా లేదా అనేది అర్థంకాని పరిస్థితి నెలకొందని అన్నారు. ప్రభుత్వం ఏంచేస్తోందో, మంత్రిమండలి ఏంచేస్తోందో తెలియడంలేదని విమర్శించారు.

ఇటీవల తూర్పుగోదావరి జిల్లాలో వరప్రసాద్ అనే దళిత యువకుడికి పోలీస్ స్టేషన్ లో శిరోముండనం చేశారని అన్నారు. ఇదేమీ చిన్న విషయం కాదని అన్నారు. ఓ పోలీస్ స్టేషన్ లోనే ఆ విధంగా జరిగిందని తెలిపారు. దీంట్లో రాష్ట్రపతి కార్యాలయం జోక్యం చేసుకోవాల్సి వచ్చిందని తెలిపారు.ఆ శిరోముండనం ఎలా చేశారో ఎవరూ చూడలేదని తెలిపారు. కానీ వైజాగ్ లో తాజాగా జరిగిన శిరోముండనం ఘటనను వీడియోలో చూస్తుంటే కడుపు మండిపోతోందని అన్నారు.

Related posts