telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

హైదరాబాద్లో కొంత పోలింగ్ శాతం తగ్గింది.. కిషన్ రెడ్డి

హైదరాబాద్లో కొంత పోలింగ్ శాతం తగ్గిందని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు.
నగరంలో నివాసం ఉంటే ఎక్కువ మంది ఏపీ వాళ్లు కావడం, ఓట్ల కోసం అందరూ అక్కడికి వెళ్లడంతో నగరంలో ఓటింగ్ శాతం తగ్గిందని అన్నారు.

ఓటు వేసిన వారు అంతా మోడీకే వేశామని బహిరంగంగా చెబుతున్నారు. అన్ని ప్రాంతాల్లో మార్పు మొదలైంది. మోడీ నాయకత్వాన్ని తెలంగాణ కోరుకుంటోంది. పట్టణ ప్రాంతాల్లోనే కాకుండా ఈసారి గ్రామాల్లో కూడా బీజేపీకి భారీగా ఓట్లు పడ్డాయి.

పార్టీ ఏదైనా సరే.. ప్రధానిగా మోడీనే ఉండాలనే అభిప్రాయం అందరిలోనూ ఏర్పడిందని అన్నారు.

Related posts