telugu navyamedia
సినిమా వార్తలు

ఐకాన్‌ స్టార్ అల్లు అర్జున్ కు సన్మానం..

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. వరల్డ్ వైడ్ గా ఈ సినిమా క్రేజ్ సంపాదించుకుంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు పుష్ప సినిమాలోని డైలాగులు, పాటలకు సోషల్ మీడియాలో రీల్స్ చేస్తున్నారు.

ఇక ఈ నేపథ్యంలో బన్ని సతీమణి స్నేహారెడ్డి తండ్రి చంద్రశేఖర్ రెడ్డి తన అల్లుడు అల్లు అర్జున్ కోసం హైదరాబాద్‌లోని పార్క్ హయత్ హోటల్లో పుష్ప సక్సెస్ పార్టీని ఏర్పాటు చేశారు.

డాక్టర్ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి బన్నికి పిల్లనిచ్చిన స్వంత మామగారు. పుష్పరాజ్‌గా అద్బుతంగా నటించిన అల్లు అర్జున్‌ను చంద్రశేఖర్ రెడ్డి సత్కరించారు.

ఇక పార్టీకి మెగాస్టార్ చిరంజీవి-సురేఖా దంపతులతో పాటు అల్లు అరవింద్‌, అల్లు స్నేహారెడ్డి, కేంద్ర మాజీ మంత్రి టి సుబ్బిరామిరెడ్డి , త్రివిక్రమ్ శ్రీనివాస్‌, క్రిష్ జాగర్లమూడి, హరీష్ శంకర్‌, గుణశేఖర్‌తో పాటు పలువురు ఈవెంట్‌కు హాజరయినట్టు తెలుస్తోంది. అలాగే అల్లుఅర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గడ్డం రవికుమార్ గజమాలతో సత్కరించారు.

ఇక ఈ పార్టీలో మెగాస్టార్‌ చిరంజీవి స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచారు. ప్రస్తుతం ఈ పార్టీకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి

Related posts