telugu navyamedia
క్రైమ్ వార్తలు

ముంబైలో భారీ అగ్నిప్రమాదం..

*సెంట్రల్ ముంబైలోని టార్డియో ప్రాంతంలో నివాస భవనంలోని 19వ అంతస్తులో భారీ ఆగ్నిప్ర‌మాదం..

*శనివారం ఉదయం 7.30 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగాయి..

*గోవాలియా ట్యాంక్ వద్ద గాంధీ హాస్పిటల్ ఎదురుగా ఉన్న కమల భవనంలో మంటలు చెలరేగాయి

ముంబై మహానగరంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. టార్డియోలోని నానా చౌక్‌లోని కమలా బిల్డింగ్‌లో శనివారం ఉదయం 20 అంతస్తుల భవనంలోని 19వ ఫ్లోర్​లో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఆరుగురు మృతిచెంద‌గా… 23 గాయ‌ప‌డ్డారు. గాయ‌ప‌డిన‌వారికి భాటియా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

ఈ ఘ‌ట‌న గోవాలియా ట్యాంక్‌లోని భాటియా ఆసుపత్రికి ఎదురుగా ఉన్న పెద్ద‌ భవనంలో ఉదయం 7 గంటల సమయంలో చాలా మంది నిద్రిస్తున్న సమయంలో మంటలు చెలరేగాయని బృహన్‌ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ అధికారి తెలిపారు.

సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే.. పరిసర ప్రాంతాల్లో దట్టంగా పొగ అలుముకుంది.

కాగా.. ముంబైలోని టార్డియోలో భవనం అగ్ని ప్రమాదం కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి తదుపరి బంధువులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2.ల‌క్ష‌లు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఈ ఘటనలో మృతి చెందిన వారికి ఒక్కొక్కరికి 2 లక్షలు, రూ. గాయపడిన వారికి ఒక్కొక్కరికి 50,000. ఎక్స్‌గ్రేషియా ఇవ్వ‌నున్నారు.

Related posts