telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

ఈటలకు వ్యతిరేకంగా కమలాపూర్ తెరాస లీడర్లు…

తెరాస పార్టీని వీడే ప్రసక్తేలేదని కమలాపూర్ ఎంపీపీ తడక రాణి శ్రీకాంత్ గారు స్పష్టం చేశారు. ఆదివారం ఉదయం హన్మకొండలో పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారిని కమలాపూర్ మండల తెరాస ముఖ్యనాయకులు కలవడం జరిగింది.కష్టకాలంలో మాకు అండగా ఉన్న తెరాస పార్టీని వీడబోమని అన్నారు.అధిష్టానం సూచనల మేరకు పనిచేస్తామని,కమలాపూర్ మండలంలో పార్టీ బలోపేతానికి కృషిచేస్తామని అన్నారు. ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారిని కలిసిన వారిలో సీనియర్ నాయకులు పేరాల సంపత్ రావు,కన్నూరు ఎంపిటిసి భాస్కర్ రావు,గుండెడు ఎంపిటిసి మేకల రవి మండల రైతుబంధు కన్వీనర్ ఇమ్మడిశెట్టి శ్రీనివాస్,కె.డి.సి.సి.డైరెక్టర్ పోరండ్ల కృష్ణ ప్రసాద్,బిసి సంఘం నాయకులు,మాజీ ఎంపిటిసి మౌటం కుమారస్వామి తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో పర్యవేక్షకులు డాక్టర్ పేర్యాల రవీందర్ రావు,సింగిల్ విండో వైస్ చైర్మన్ ఇంద్రసేన రెడ్డి,నాయకులు ప్రదీప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related posts