telugu navyamedia
క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

బాలికను వేధించిన ఎమ్మెల్యే అనుచరుడు.. పోక్సో చట్టం కింద కేసు నమోదు

SIT Investigation YS viveka Murder

పెళ్లి చేసుకొని భార్యతో కాపురం చేస్తున్న ఓ వ్యక్తికి అమ్మాయిని ప్రేమించాలని కోరిక పుట్టింది. అధికార పార్టీకి చెందిన కార్పొరటర్ భర్తను అనే ధీమాతో తనను ప్రేమించాలని ఓ మైనర్ బాలిక వెంటపడటం మొదలుపెట్టాడు. అయితే ఇందుకు యువతి నిరాకరించడంతో వేధింపులు తీవ్రతరం చేశాడు. చివరికి బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో ప్రేమ కథ అడ్డడం తిరిగి కేసులో ఇరుక్కొన్నాడు.

తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ కార్పొరేటర్ లత భర్త శ్రీనివాస్ గత కొంతకాలంగా ఇదే ప్రాంతానికి చెందిన యువతిని వేధిస్తున్నాడు. టీఆర్ఎస్ నేత, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అనుచరుడైన శ్రీనివాస్ పెళ్లి చేసుకోవాలని ఆ బాలిక వెంటపడటం మొదలుపెట్టాడు. యువతి తల్లిదండ్రులు మందలించినా ఆయన ప్రవర్తన మార్చుకోలేదు. చివరికి ఈ వేధింపులు హద్దు దాటడంతో తల్లిదండ్రుల సాయంతో బాలిక ఆర్మూర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో శ్రీనివాస్ పై పోక్సో చట్టం కింద కేసు నమోదుచేసి, నిందితుడిని అరెస్ట్ చేశారు.

Related posts