పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఐరన్ లేడీ అని ఆమెను జాగ్రత్తగా హ్యాండిల్ చేయకుంటే ప్రమాదమని బీజేపీ ఎంపీ శత్రుఘ్న సిన్హా పార్టీ నాయకత్వానికి సూచించారు. ప్రభుత్వాన్ని, పార్టీని తన వ్యాఖ్యలతో తరచూ ఇరకాటంలోకి నెట్టే సిన్హా మమతా వర్సెస్ సీబీఐ వ్యవహరంలోనూ తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. కోల్కతా పోలీస్ కమిషనర్ నివాసంపై సీబీఐ దాడుల నేపథ్యంలో మమతా సర్కార్, కేంద్ర ప్రభుత్వం మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో ప్రభుత్వం పై తరచూ ఘాటు విమర్శలు చేసే మమతా ను జాగ్రత్తగా డీల్ చేయకుంటే ప్రమాదమని శత్రుఘ్న సిన్హా హెచ్చరించారు. ఏమైనా సమయం మించిపోతుంది జాగ్రత్త అంటూ సిన్హా నర్మగర్భంగా వ్యాఖ్యానిస్తూ ట్వీట్ చేశారు. శత్రుఘ్న సిన్హా గతంలోనూ ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ కేంద్ర నాయకత్వాన్ని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే.


కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ బుజ్జగింపు రాజకీయాలు: అమిత్షా