telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన వైఎస్ షర్మిల

దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 16వ వర్ధంతి సందర్భంగా ఆయన కుమార్తె, ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల ఘన నివాళులు అర్పించారు.

తన తండ్రి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని, ఇప్పటికీ ఎందరో తమ ఇళ్లలో దేవుడిగా పూజిస్తున్నారని ఆమె భావోద్వేగంగా పేర్కొన్నారు.

“వైఎస్ఆర్ గారిది అద్భుతమైన జీవితం. దేవుడు రాజశేఖర్ రెడ్డి గారిని గొప్పగా వాడుకున్నారు. ఆయన మరణించి 16 ఏళ్లు అయినా నేటికీ ప్రజల గుండెల్లో నిలిచిపోయారు.

ఇప్పటికీ దేవుడి పటాల పక్కన వైఎస్ఆర్ గారి ఫోటో పెట్టీ పూజిస్తున్నారు. ఆరోగ్య శ్రీ, ఉచిత విద్యుత్, ఫీజు రీయింబర్స్ మెంట్ లాంటి గొప్ప పథకాలు వైఎస్ఆర్ గుండెల్లోంచి పుట్టినవి.

ఈ పథకాలతో లబ్ధి పొందని తెలుగు గడపే లేదు.

వైఎస్ఆర్ గారిని గుండెల్లో పెట్టుకొని పూజించే ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు. వైఎస్ఆర్ గారు చనిపోయాక ఆ బాధను జీర్ణించుకోలేక గుండె పగిలి 700 మంది చనిపోయారు.

ఈ సందర్భంగా వారికి కూడా మనసారా నివాళులు అర్పిస్తున్నాం” అని షర్మిల పేర్కొన్నారు.

Related posts