telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

షాది ముబారక్ ట్రైలర్ విడుదల…

ఈ మధ్య బులితెర నటీనటులు అందరూ వెండితెరపైకి వస్తున్నారు. అయితే ‘మొగలిరేకులు’ సీరియల్‌లో ఆర్కే నాయుడు పాత్రను ప్రేక్షకులు ఎప్పటికీ మరిచిపోలేరు. పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటించిన సాగర్‌ను ఇప్పటికీ ఆర్కే నాయుడుగానే ఫేమస్. ఈ ఒక్క పాత్రతో సాగర్‌కు హీరోకి వచ్చినంత క్రేజ్ వచ్చింది. ఆ తరువాత చాలా సినిమాల్లోనూ సహా నటుడిగా కనిపిస్తూ వచ్చాడు సాగర్‌. 2016లో ‘సిద్ధార్థ’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆ తరువాత మళ్లీ వెండితెరపై కనిపించలేదు. ప్రస్తుతం ‘షాదీ ముబారక్’ సినిమాతో రాబోతున్నాడు. ఈ చిత్రానికి పద్మశ్రీ దర్శకత్వం వహించారు. సాగర్‌ సరసన దృశ్యా రఘునాథ్‌ హీరోయిన్‌గా నటించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ వంటి ప్రతిష్టాత్మక బ్యానర్‌లో దిల్ రాజు, శిరీష్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. అదితి, ఝాన్సీ, హేమ, రాజశ్రీనాయర్‌  ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల అయింది. ఈ ట్రైలర్ కామెడి, ఎమోషనల్‌గా ఆకట్టుకుంటోంది. సినిమాపై అంచనాలను ట్రైలర్ వేరే స్థాయికి తీసుకెళ్లాయి. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌‌గా రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమాని మార్చి 5న విడుదల చేయబోతున్నారు. చూడాలి మరి ఈ సినిమా విజయాన్ని సాధిస్తుందా… లేదా అనేది.

Related posts