telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కబీర్ సింగ్ కి .. అర్జున్ రెడ్డి ప్రశంసలు..

vijay devarakonda praised kabir sing

2011లోనే విజయ్ దేవరకొండ నువ్విలా చిత్రంతో తెలుగు తెరకు పరిచయమై, ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమను ఏలుతున్నాడు. 2011 నుంచి ఎన్నో సినిమాలు తీసినప్పటికి పెళ్లిచూపులు సినిమాతో తెలుగు అభిమానులను సొంతం చేసుకున్నాడు. అప్పటి నుంచి విజయ్ దేవరకొండ ఫార్మ్ లోకి వచ్చాడు. అనంతరం ఆయన సినీ జీవితాన్ని మలుపు తిప్పిన సినిమా అర్జున్ రెడ్డి. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ కోపాన్ని, ప్రేమను, అతని నటనను చూపించి తెలుగు రాష్ట్రాల ప్రజలు ఫిదా చేశాడు. కాగా ఈ సినిమాతో షాలిని పాండే కూడా ప్రీతిగా మంచి పేరు తెచ్చుకుంది.

దర్శకుడు సందీప్ వంగా మొదటి సినిమా అయినప్పటికీ కథ బాగుండడంతో సూపర్ హిట్ అయ్యింది. టాలీవుడ్ లో అర్జున్ రెడ్డి ఎంత బిగ్గెస్ట్ హిట్టో అందరికి తెలుసు. అందుకే ఈ సినిమాను అన్ని భాషల్లోని రూపొందించారు. కోలీవుడ్, బాలీవుడ్ లో ఈ సినిమా రూపొందింది. అయితే బాలీవుడ్ లో కబీర్ సింగ్ ఇప్పటికే విడుదలయ్యింది. ఈ సినిమా గురించి విలేకరులు విజయ్ దేవరకొండను కబీర్ సింగ్ చూశారా అని అడగగా ‘కబీర్ సింగ్ చూడడం వాళ్ళ నాకు ఎం ఉపయోగం లేదు, నాకు కథ అంత ఇప్పటికే తెలుసు, ఇంకా చూడక్కర్ లేదు కానీ కబీర్ సింగ్ లో షాహిద్ కబీర్ జీవించి ఉంటాడు. అది నాకు తెలుసు అని విజయ్ దేవరకొండ వ్యాఖ్యానించారు.

Related posts