ఖమ్మం జిల్లా భద్రాచలం తహసీల్దార్ కార్యాలయంలో ఓ ఉద్యోగి ఏసీబీ వలకు చిక్కాడు. కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ నరసింహారావు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ కోసం ఓ వ్యక్తి నుంచి 1000 రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
విద్యాసాగర్ రావు అనే మోటార్ వెహికిల్ మెకానిక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ కోసం తహశీల్దార్ కార్యాలయాని వెళ్లగా.. విద్యాసాగర్ రావును నరసింహారావు రూ.1000 లంచం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు వల పన్ని లంచం తీసుకుంటుండగా నరసింహారావును పట్టుకున్నారు. ఈ దాడిలో డిఎస్పీ మధుసూదనరావు, ఇన్స్పెక్టర్ రమణమూర్తి పాల్గొన్నారు.