పేరెంట్స్ కమిటీ ఏర్పాటు చేయాలని 1998లో అనుకున్నాను – నేను అనుకునే లక్ష్యాన్ని నెరవేస్తాననే ధైర్యం కొత్తచెరువులో ఇచ్చారు- పాఠశాలలు పవిత్ర దేవాలయాలు – మన పిల్లల్ని తీర్చిదిద్ది జ్ఞానాన్ని ఇచ్చే పుణ్యక్షేత్రం పాఠశాల – చదువుకుని పైకి వచ్చినవారు స్కూళ్లకు ఎంతోకొంత చేయూత ఇవ్వాలి –
విద్యావ్యవస్థను అద్భుతంగా నిర్వహిస్తున్న మంత్రి నారా లోకేశ్ కు అభినందనలు – ఎవరినైనా మర్చిపోతాం కానీ.. టీచర్లకు మరచిపోలేం – తల్లి, తండ్రి తర్వాత స్థానం గురువుది – పనుల్లో పడి పిల్లల్ని మర్చిపోతున్నాం – లోకేశ్ చదువుకునే రోజుల్లో ఎప్పుడూ పేరెంట్స్ మీటింగ్‍కు వెళ్లలేకపోయా – పిల్లలకు
సంబంధించిన ప్రతివిషయంలో తల్లిదండ్రులు భాగస్వామ్యం కావాలి – నేను మహిళా పక్షపాతాని.. ఏ పని చేసినా మహిళలను దృష్టిలో పెట్టుకునే చేస్తాను – మగ పిల్లల కంటే ఆడపిల్లలు తక్కువ కాదు – మగ, ఆడ బిడ్డలను సమానంగా చూసుకోవాలి – అందుకే ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇచ్చాం –
మీ పిల్లల చదువు బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది – విద్యార్థుల విషయంలో టీచర్లదే కాదు.. తల్లిదండ్రులకు కుడా బాధ్యత ఉంటుంది – ప్రభుత్వ బడుల్లో బాగా చదువు చెప్పారని ఒక అపోహ – మీ పిల్లలని ఎక్కడ చదివించుకున్నా నాకు అభ్యంతరం లేదు – ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ
పాఠశాలలను తీర్చిదిద్దుతాం – మెగా పేరెంట్స్ మీటింగ్‍తో గిన్నీస్ రికార్డు నెలకొల్పాం – విద్యార్థుల హాజరును తల్లిదండ్రులు తెలుసుకునేందుకు కొత్తగా యాప్ తెచ్చాం – మీ పిల్లలు స్కూల్ డుమ్మా కొడితే తల్లిదండ్రులకు వెంటనే తెలిసిపోతుంది -పిల్లలకు మంచి యూనీఫాం ఇచ్చాం.. మంచి పుస్తకాలు ఇచ్చాం
– కొత్తచెరువుకు వస్తే మళ్లీ చదువుకోవాలనిపిస్తోంది – పిల్లలకు ఇచ్చే పుస్తకాలు, బ్యాగులపై కూడా గత పాలకులు బొమ్మలు వేస్తున్నారు – కూటమి ప్రభుత్వం వచ్చాక గత పాలకుల ఫోటోలను పుస్తకాలపై తొలగించాం – పాఠశాలను ప్రారంభించగానే విద్యార్థులకు పుస్తకాలు ఇచ్చాం – గత ప్రభుత్వం రద్దు చేసిన
మధ్యాహ్న భోజన పథకాన్ని మళ్లీ తీసుకొచ్చాం – నేను చదువుకునే రోజుల్లో రానూపోనూ 12 కి.మీ నడిచి వెళ్లేవాడిని – ఇప్పుడు మీకు ఆ బాధ లేదు.. ఉచిత బస్సు అందిస్తున్నాం – విద్యార్థులకు రుచికరమైన ఆహారం ఇస్తున్నాం – ఇంటింటికి న్యూస్ పేపర్లు వేసి వచ్చిన డబ్బుతో చదువుకున్న వ్యక్తి కలాం – వీధి
దీపాల కింద చదివి రాజ్యాంగాన్ని రాసే స్ఫూర్తి వచ్చిందంటే అది అంబేడ్కర్ గొప్పతనం – ఒకరు రాజ్యాంగం రాయడం, మరొకరు మిస్సైల్ మ్యాన్‍గా తయారయ్యారు – గడిచిన ఐదేళ్లలో ఒక్క టీచర్‍ను కూడా నియమించలేదు -టీచర్లు లేకుండా విద్యాసంస్కరణలు ఎలా తెచ్చారో జగనే చెప్పాలి -ఆంగ్ల మాధ్యమం
పెట్టామంటూ లేని పోని సమస్యలు తీసుకొచ్చారు – టీచర్లను గౌరవప్రదంగా చుస్తాం.. కొత్త సంస్కరణలు తీసుకొస్తాం – ఇప్పటికే 12 డీఎస్సీలు పెట్టి లక్షా 66 వేల మందికి టీచర్ ఉద్యోగాలిచ్చాం – ఇటీవలే ఇంకో డీఎస్సీ వేసి 16,347 మందికి నోటిఫికేషన్ ఇచ్చాం : సీఎం చంద్రబాబు


23 మంది ఎమ్మెల్యేలే అంటూ జగన్ వ్యాఖ్యానించడం సరికాదు: కోడెల