telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

కుట్టు మిషన్ ఎక్కిన భారత ప్రథమ మహిళ..కరోనా నివారణకు మాస్క్ ల తయారీ!

savitha kovind

కరోనా నివారణకు తనవంతుగా భారత ప్రథమ మహిళ, రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ భార్య సవితా కోవింద్ కుట్టుమిషన్ ఎక్కి మాస్క్ లను తయారు చేశారు. కరోనా నివారణకు న్యూఢిల్లీలోని షెల్టర్ హోమ్స్ లో ఉన్న నిరాశ్రయులకు మాస్క్ లను తయారు చేసి అందించారు. రాష్ట్రపతి భవన్ లోని శక్తి హాత్ లో ఆమె స్వయంగా కుట్టుమిషన్ పై మాస్క్ లను రూపొందించారు.

ఆపై వాటిని ఢిల్లీ అర్బన్ షెల్టర్ ఇంప్రూవ్ మెంట్ బోర్డుకు పంపించారు. తన చర్యల ద్వారా కరోనా పోరుకు ప్రతి ఒక్కరూ కలసి రావాలన్న సందేశాన్ని ఆమె సమాజానికి ఇచ్చారు. కాగా మాస్క్ లను ధరించడం ద్వారా కరోనా వైరస్ శరీరంలోకి వ్యాపించకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవచ్చన్న సంగతి తెలిసిందే.

Related posts