తమిళనాడు దివంగత సీఎం జయలలిత అక్రమాస్తుల కేసులో దోషిగా నిర్ధారణ కావడంతో ప్రస్తుతం కర్ణాటకలోని పరప్పన అగ్రహార జైల్లో శశికళ శిక్షను అనుభవిస్తున్న విషయం తెలిసిందే. ఆమె ముందస్తుగా విడుదల అయ్యే అవకాశం లేదని ఆ రాష్ట్ర జైళ్ల శాఖ స్పష్టం చేసింది. ఆమెకు పడిన శిక్ష పూర్తయిన తరువాత వచ్చే సంవత్సరం జనవరిలోనే విడుదల అవుతారని పేర్కొంది.
2017 ఫిబ్రవరి నుంచి ఆమె శిక్షను అనుభవిస్తుండగా, సత్ప్రవర్తన కారణంగా అక్టోబర్ లో విడుదల అవుతారని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే, ఓ సమాచార హక్కు కార్యకర్త ఆమె విడుదలపై కర్ణాటక జైళ్ల శాఖకు లేఖ రాయగా, అటువంటిదేమీ జరుగబోదని స్పష్టమైంది.2021 జనవరి 27న ఆమె విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని, సహ చట్టం కింద నరసింహమూర్తి అనే వ్యక్తి చేసిన ధరఖాస్తుకు జైళ్ల శాఖ బదులిచ్చింది.


రాజధానిని కాపాడుకునే బాధ్యత ప్రజలపై ఉంది: సుజనా చౌదరి