సూపర్ స్టార్ మహేశ్‌బాబు, కీర్తి సురేశ్ జంటగా పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘సర్కారువారి పాట’. ఈ నెల 14న ప్రేమికుల రోజు సందర్భంగా ఈ చిత్రం నుంచి ఫస్ట్ సాంగ్ విడుదల కానున్న సంగతి తెలిసిందే.
ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ప్రతి పోస్టర్ ఈ మూవీ మరింత ఆసక్తి కలిగిస్తున్నాయి. ఇందులో మహేష్ బాబు చాలా హ్యండ్ సమ్ గా కనిపిస్తున్నాడు.
అభిమానులు ఎంతగా ఎదురు చూస్తున్న ఫస్ట్ సాంగ్‌కు సంబంధించిన ప్రోమో విడుదల చేశారు మేకర్స్. ‘వందో.. ఓక వెయ్యో’ అంటూ సాగే ఈ మెలోడి సాంగ్ ఆకట్టుకుంటుంది. ఈ సాంగ్ మహేశ్ బాబు కీర్తి సూరేశ్‌ను ఫాలో అవుతున్నట్లు కనిపిస్తున్నాడు.
మ్యూజిక్ సెన్సెషన్ తమన్ స్వరాలు అందించిన ఈ పాటను సింగర్ సిద్ శ్రీరామ్ ఆలపించాడు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ సంస్థలు కలిసి నిర్మిస్తున్న ‘సర్కారు వారి పాట’ మే 12వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
నగ్నంగా ఎలా నటిస్తుంది… అమలాపాల్ కు, దర్శకుడికి బుద్ధి ఉందా ? : తమ్మారెడ్డి భరద్వాజ