telugu navyamedia
క్రైమ్ వార్తలు

ఖమ్మంలో విషాదం.. ట్యాంక్‌ శుభ్రం చేస్తూ కార్మికుడు మృతి

ఖమ్మం జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ట్యాంక్‌ శుభ్రం చేస్తూ ఓ కార్మికుడు మృతి చెందాడు. మృతుడు మున్సిపల్‌ కాంట్రాక్ట్‌ కార్మికుడు సందీప్‌(23)గా గుర్తించారు.

వివ‌రాల్లోకి వెళితే..

మిషన్‌ భగీరథ ట్యాంక్​ను శుభ్రం చేసేందుకు ముగ్గురు పారిశుద్ధ్య కార్మికులు దిగారు. వారు నీటి ట్యాంక్‌ లోపల శుభ్రం చేస్తుండగానే పైప్‌లైన్‌లోకి ఓ కార్మికుడు ప్రమాదవశాత్తు జారి పోయాడు. పైపులైన్‌ చిన్నదిగా ఉండడంతో ఊపిరి ఆడక కార్మికుడు మృత్యువాత పడ్డారు.

సమాచారం అందుకున్న పోలీసులు క్రేన్ సాయంతో మట్టిని తవ్వి పైపులైన్‌ నుంచి కార్మికుడి మృతదేహాన్ని వెలికి తీశారు. ఈ ఘటనతో కార్మికుని కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని కార్మిక సంఘాల ధర్నా చేపట్టాయి.

Related posts