telugu navyamedia
క్రైమ్ వార్తలు

లైవ్‌లో రిపోర్టర్‌ ఇంట్లో అర్థనగ్నంగా యువతి… ఆతరువాత ఏంజరిగిందంటే…

‘వర్క్ ఫ్రం హోమ్’ చేసేటప్పుడు ఇంట్లో ఎవరో ఒకరు ఏదో ఒక రూపంలో డిస్టబ్ చేస్తూనే ఉంటారు. ముఖ్యంగా వీడియో కాల్స్‌లో మాట్లాడేప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. లేకపోతె ఇదిగో ఇలావుంటుంది పరిస్థితి. వివరాల్లోకివెళ్తే .. స్పెయిన్‌కు చెందిన జర్నలిస్ట్ అల్ఫాన్సో మెర్లోస్ ‘వర్క్ ఫ్రం హోమ్’ నేపథ్యంలో ఇంటి నుంచి లైవ్‌లో సమాచారం అందిస్తున్నాడు. మరో జర్నలిస్ట్ జవియర్ నెగ్రే నిర్వహిస్తున్న ‘స్టేట్ ఆఫ్ అలారం’ అనే యూట్యూబ్ చానెల్‌లో మెర్లోస్ గెస్టుగా మాట్లాడాడు. ఆ సమయంలో అతడి వెనకాల నుంచి లోదుస్తులు మాత్రమే ధరించిన యువతి అర్థనగ్నంగా నడుచుకుని వెళ్లడం లైవ్‌లో కనిపించింది. ఆమెను వీడియోలో చూసిన నెగ్రే వెంటనే అతడని అప్రమత్తం చేశాడు. కానీ, అప్పటికే జరగకూడని నష్టం జరిగిపోయింది. ప్రేక్షకులు ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసి వైరల్ చేస్తున్నారు. ఆశ్చర్యపోయే విషయం ఏమంటే ఆ వీడియోలో ఉన్న యువతి అతడి భార్య మార్తా లోపెజ్ కాదట. ఆమె ఓ స్పెయిన్‌కు చెందిన ఓ టీవీ రిపోర్టర్ అలెక్సియా రివాస్ అని తెలిసింది. ఆ జర్నలిస్టు భార్య మరెవ్వరో కాదు.. ‘బిగ్‌ బ్రదర్’ షో మాజీ కంటెస్టెంట్ మార్తా లోపెజ్. ఈ వీడియో చూసిన తర్వాత ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఇక అతడితో కలిసి జీవించేది లేదని, అతడి నుంచి విడిపోతున్నానని తెలిపింది. చూసారుగా అప్రమతంగా లేకపోతే ఇలానేవుంటుంది పరిస్థితి.

Related posts