ఐకాన్ స్టార్ అల్లు అర్జున్- సుకుమార్ క్రేజీ కాంబోలో వచ్చిన ‘పుష్ప’ మూవీ భారీ అంచనాల నడుమ డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకొచ్చింది. శేషాచలం ఎర్రచందనం స్మంగ్లిగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో స్మగ్లర్‌గా పుష్పరాజ్ అనే మాస్ పాత్రలో అల్లు అర్జున్ నటన చూసి ఫ్యాన్స్ కు పునకాలే అని చెప్పాలి. ఈ సినిమాలో పుష్పరాజ్ ప్రేయసి శ్రీవల్లి పాత్రలో రష్మిక సందడి చేసింది.

అంతేకాకుండా ఈ సినిమాలో సమంత చేసిన స్పెషల్ సాంగ్ ‘ఊ అంటావా మావా.. ఊహు అంటావా’ పాట ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ పాటలో పొట్టి లంగా జాకెట్‌తో తన అందచందాలను అరబోస్తూ కుర్రకారుకి పిచ్చేక్కిస్తుంది.

ఫోక్ సింగర్ ఇంద్రావతి చౌహాన్ హస్కీ వాయిస్‌తో ఆలపించిన ఈ సాంగ్ యూట్యూబ్‌లో మిలియన్ల వ్యూస్ సొంతంచేసుకుని సరికొత్త రికార్డు సృష్టించింది. అన్ని భాషల్లో కలిపి ఈ లిరికల్ వీడియో 100 మిలియన్ వ్యూస్ సాధించింది. ఈ సందర్భంగా కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు మూవీ యూనిట్.

కాగా ఈ పాట కోసం సమంత తన్ ఇన్‌స్టాలో ఓ పోస్ట్ పెట్టింది. “గుడ్, బ్యాడ్, ఫన్నీ, సీరియస్, టాక్ షో హోస్ట్‌గా ఇలా అన్నింట్లో కష్టపడి పనిచేశాను. నేను నాకిచ్చిన బాధ్యతలను సమర్థంగా పోషించడానికి 100శాతం కష్టపడతాను. అలానే సెక్సీగా కనిపించడానికి చాలా హార్డ్‌వర్క్ చేయాలి” అని రాసుకొచ్చింది. అలాగే మీ ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు’ అని ఈ సందర్భంగా ‘ఊ అంటావా మావా.. ఊహు అంటావా’ పాట హ్యాష్ ట్యాగ్‌ను జోడించింది సమంత. ఇప్పుడు ఈ పోస్ట్ వైరల్‌గా మారింది.

