ఎన్నికలను పురస్కరించుకొని, ఆ అంశంపై చిత్రం నిర్మించడం జరిగింది. మంచు వారబ్బాయి విష్ణు ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ఓటర్. జీఎస్ కార్తీక్ దర్శకత్వంలో రామా రీల్స్ బ్యానర్‌పై జాన్ సుధీర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళంలో విడుదల కానున్న ఈ చిత్రంలో విష్ణు సరసన సురభి కథానాయికగా నటిస్తుంది. తాజాగా చిత్ర టీజర్ విడుదల చేశారు.
ఇందులో ‘అహింస మార్గం ద్వారా ఒక్క బుల్లెట్ కూడా కాల్చకుండా స్వాతంత్య్రం తెచ్చుకున్న దేశం మనది. మనం పేదరికంపై పోరాటం చేశాం కానీ, పేదలపై పోరాటం చేయలేదు. మార్పు మనలో రావాలి’ అని మంచు విష్ణు చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటోంది. యాక్షన్ సన్నివేశాలతో పవర్ ఫుల్ డైలాగ్స్‌తో టీజర్ ఆకట్టుకునేలా ఉంది. మరి ఈ టీజర్‌పై మీరు ఓ లుక్కేయండి.