ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రష్మిక మందన్న హీరోహీరోయిన్లుగా క్రియెటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ‘పుష్ప . పాన్ ఇండియా లెవల్‌లో డిసెంబర్ 7న విడుదలై బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల రికార్డులను సృష్టిస్తోంది.
ఇక పోతే..బన్నీ మాస్ నటనతో పాటు రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ తనదైన మ్యూజిక్‌తో అభిమానులు ఊగిపోతున్నారు. మరీ ముఖ్యంగా ఈ సినిమాలో సమంత చేసిన స్సెషల్ సాంగ్ ఊ అంటావా మామా..’ పాట ఎంతో పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
అంత సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ పాట.. పాన్ ఇండియా రేంజ్‌లో అంటే 5 భాషల్లో కలిపి 200 మిలియన్స్ వ్యూస్‌ను దక్కించుకుంది. ముఖ్యంగా తెలుగులో అయితే 119 మిలియన్స్‌ను క్రాస్ చేసింది.
బన్నీతో కలిసి ఈ పాటకి సమంత వేసిన స్టెప్పులు, అందాలతో కుర్రాళ్లు కు హీట్ పుట్టించేదనే చెప్పాలి. అయితే సమంత ఏ విధంగా కష్టపడిందో తన ఇన్‌స్టాగ్రామ్‌లో బి హైండ్ ది సీన్స్ అంటూ ప్రాక్టీస్ చేసిన వీడియోను పోస్ట్ చేసింది.
సమంత ప్రాక్టీస్ చేసిన ఈ వీడియోలో అరకొర దుస్తుల్లో సమంత స్టెప్స్ కుర్రకారుని నిద్రలేకుండా చేస్తుంది.ప్రస్తుతం ఇది కాస్త వైరల్‌గా మారింది.
బిగ్ బాస్-3పై మహేష్ విట్టా షాకింగ్ కామెంట్స్