చెలీ!
నీ తనువు స్పర్శలో ఉంది
అనిర్వచనీయమైన అనుభూతి
నీ వెచ్చనిమెత్తని కౌగిలిలో దాగుంది
స్వర్గలోకపు సుఖసంతోషాలు
నీ ప్రేమచూపుల్లో నిల్వవుంది
అయస్కాంతపు ఆకర్షణ
నీ అధరాలలో అమృతపు ధారలున్నాయి
నీ కనులలో మిలమిల మెరిసే
ప్రేమ తారలున్నాయి
నీ ఊసుల్లో వలపుల వసంతాలున్నాయి
నీ పలుకుల్లో సప్త సంగీత
స్వరాలున్నాయి
నీ శ్వాసలో నా ప్రాణం
నిక్షిప్తమై ఉంది
నీ ప్రేమలోనే నా బ్రతుకు
మల్లెతీగలా అల్లుకొనివుంది
సఖీ! నీవే నాప్రాణం!
నీవే నా ధ్యానం! నీవే సర్వస్వం
-గద్వాల సోమన్న, ఎమ్మిగనూరు

