ఇంగ్లండ్‌తో పుణె వేదికగా జరిగిన తొలి వన్డేలో ఓపెనర్ శిఖర్ ధావన్ కెరీర్‌లో 18వ శతకాన్ని నమోదు చేసే అవకాశాన్ని తృటిలో చేజార్చుకున్నాడు. 95 పరుగులు చేసినప్పటి నుంచి పరుగులు చేయడానికి కష్టపడిన గబ్బర్.. మరో మూడు పరుగులు మాత్రమే చేసి అవుటయ్యాడు. 98 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద బెన్ స్టోక్స్ వేసిన షార్ట్ పిచ్ స్లో బంతిని పుల్ షాట్ ఆడబోయి షార్ట్ మిడ్ వికెట్‌లో ఇయాన్ మోర్గాన్‌కు క్యాచ్‌గా చిక్కాడు. 90 పరుగుల వరకూ వేగంగా బ్యాటింగ్ చేసిన ధావన్.. సెంచరీకి చేరువలో ఒత్తిడిలోనయ్యాడు. 100 మార్క్ చేరే క్రమంలో నిదానంగా ఆడి వికెట్ చేజార్చుకున్నాడు. అయితే శిఖర్ ధావన్ ఓపెనర్‌గా వచ్చి తొంబైల్లో అవుట్ కావడం ఇది ఐదోసారి. ఇలా వన్డే క్రికెట్‌లో అత్యధికసార్లు తొంబైల్లో ఔటైన టీమిండియా ఓపెనర్ల జాబితాను పరిశీలిస్తే.. లిటిల్ మాస్టర్ సచిన్ టెండూల్కర్ తొలి స్థానంలో ఉన్నాడు. సచిన్ ఏకంగా 16 సార్లు తొంబైల్లో పెవిలియన్ చేరారు. సచిన్ తర్వాతి స్థానంలో బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఉన్నాడు. దాదా ఆరుసార్లు ఇలా తొంబైల్లో అవుటయ్యాడు. మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా ఐదుసార్లు తొంబైల్లో ఔటయ్యారు. గబ్బర్ కూడా ఐదుసార్లు ఔట్ అయ్యాడు.
previous post
next post


కాంగ్రెస్ పార్టీలో కోవర్టులు: జగ్గారెడ్డి