వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో ఎంపీ వై.ఎస్. అవినాశ్‌రెడ్డి పెదనాన్న వై.ఎస్. ప్రతాప్‌రెడ్డి సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలం వెలుగులోకి వచ్చింది. 2021 ఆగస్టు 16వ తేదీన సీబీఐకి ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు.
‘2019 మార్చి 15న ఉదయం 6.30 గంటల సమయంలో మా సోదరుడు వైఎస్ మనోహర్‌రెడ్డి నాకు ఫోన్ చేసి వివేకానందరెడ్డి గుండెపోటు, రక్తపు వాంతులతో మరణించాడని చెప్పాడు. 7.20గంటలకు వివేకా ఇంటికి చేరుకున్నాను. అక్కడ హాల్లో మనోహర్‌రెడ్డి కూర్చోని ఉన్నాడు. బయట గార్డెన్లో వైఎస్ అవినాశ్‌రెడ్డి ఎవరితోనూ ఫోన్లో మాట్లాడుతున్నాడు.
గుండెపోటుతో రక్తపువాంతులు చేసుకుని వివేకా మృతి చెందినట్లు… తన సోదరుడు వై.ఎస్. మనోహర్‌రెడ్డి హత్య జరిగిన రోజు ఉదయం ఆరున్నరకే తనకు చెప్పారన్నారు. వివేకానందరెడ్డి గుండెపోటుతో చనిపోయినట్లు ఎంపీ అవినాశ్‌రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్‌రెడ్డి, చిన్నాన్న మనోహర్‌రెడ్డి, దేవిరెడ్డి శంకర్‌రెడ్డి అందరికీ చెప్పేశారని అన్నారు. ఆ తర్వాత వివేకానందరెడ్డి ఇంటికి తాను వెళ్లినట్లు చెప్పారు.
వివేకానందరెడ్డి ఇంట్లో బెడ్ రూంలోకి వెళ్ళి చూసేసరికి..అప్పటికే అక్కడ దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి, కృష్ణారెడ్డి, ఇనయతుల్లా ఉన్నారని చెప్పారు. బెడ్‌మీద, నేలపైన రక్తపుమరకలు ఉన్నాయని… బాత్ రూంలో వివేకా మృతదేహం కనిపించిందని తెలిపారు. అక్కడి పరిస్థితులను చూస్తే గుండెపోటు కాదని… ఏదో జరిగిందనే విషయం గ్రహించానని సీబీఐకి వివరించారు.
అవినాశ్‌రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి దగ్గరుండి పని మనిషితో రక్తపు మరకలను శుభ్రం చేయించినట్లు చెప్పారు. సాక్ష్యాధారాలను ఎందుకు చెరిపేస్తున్నారని సీఐ శంకరయ్య ప్రశ్నించినా వాళ్లు పట్టించుకోలేదన్నారు.నా కళ్ల ముందే ఆధారాలు చెరిపేస్తుంటే అక్కడ ఉండలేక మా ఇంటికి వచ్చేశాను. అదే సమయంలో బాడీ ఫ్రీజర్ బాక్స్ తేవడం చూశాను.
ఆయన మరణానికి వారం ముందు పులివెందుల రింగ్‌రోడ్డులోని నా ఆఫీసుకు వచ్చి అరగంట మాట్లాడారు. ఆ సమయంలో వివేకానందరెడ్డి గతంలో అడిగారని ప్రతాప్‌రెడ్డి చెప్పారు. వివేకాకు ప్రజల్లో మంచిపేరు ఉండేదన్న ఆయన… వైఎస్.భాస్కర్‌రెడ్డి కుటుంబం మొదటినుంచీ ఆయనకు వ్యతిరేకంగా వ్యవహరించేదని సీబీఐకి ఇచ్చిన స్టేట్మెంట్లో తెలిపారు.ఈ మేరకు గతేడాది డిసెంబరు 8న సీబీఐ అధికారులకు ఆయనిచ్చిన వాంగ్మూలం ప్రతులు గురువారం వెలుగుచూశాయి. అందులోని ప్రధానాంశాలివి…
అమరావతిలో వేల ఎకరాల భూములు కొన్నారు: విజయసాయిరెడ్డి